Monday, May 6, 2024

పద్మా అవార్డుల ప్రదానోత్సవం.. పీవీ సింధుకు ప‌ద్మ‌భూష‌ణ్‌

ఢిల్లీలోని రాష్ట్రపతి భవనల్​లో పద్మా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2020 ఏడాది గాను వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మా అవార్డులను రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అందజేశారు. 2020 ఏడాదికి మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ఇచ్చారు. వీటిలో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు.గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో సహా ఏడుగురిని పద్మవిభూషణ్​తో సత్కరించింది.అసోం మాజీ సీఎం, దివంగత తరుణ్ గొగొయ్‌, గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్‌, కేంద్ర మాజీమంత్రి, దివంగత రాంవిలాస్ పాసవాన్‌ను పద్మభూషణ్​తో గౌరవించారు.భారత విదేశాంగ మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్​ తరఫున ఆమె కూతురు బున్సూరి స్వరాజ్​ పద్మవిభూషణ్ స్వీకరించారు.

హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌, వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌ పీవీ సింధు.. ఇవాళ ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డును అందుకున్నారు. 2020 సంవ‌త్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వ‌రించింది. కాగా, రియోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో సింధు సిల్వ‌ర్ ప‌త‌కం గెల‌వ‌గా.. ఇటీవ‌ల టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడ‌ల్‌ను గెలుచుకున్న‌ది. 

ఒలింపిక్ ప్లేయ‌ర్ పుస‌ర్ల వెంక‌ట సింధు రియోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ ప‌త‌కం గెల‌వ‌గా.. ఇటీవ‌ల టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడ‌ల్‌ను గెలుచుకున్న‌ది.  ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమి పద్మశ్రీ అందుకున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్​ షా సహా ఇతర ముఖ్య నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement