Thursday, April 25, 2024

Biz: త‌క్కువ‌ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్ల‌పై బౌన్స్ జ‌ర్నీ!

Electric Scooter: ఇండియాలో అతి త‌క్కు ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో అందుబాటులో రానుంది. బౌన్స్ సంస్థ కొత్తగా ఈ స్కూటర్ల తయారీ, మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. రెండు వేరియంట్లలో రానున్న ఈ స్కూటర్ల వివ‌రాలేంటో చ‌దివి తెలుసుకుందాం..

ఎలక్ట్రిక్ స్కూటర్ల రెంటల్ స్టార్టప్ సంస్థ బౌన్స్ (Bounce) కొత్తగా ఈ స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ నిమిత్తం ఏడాది కాలంలో 742 కోట్లు పెట్టుబడి పెట్ట‌డానికి రెడీ అయ్యింది. ఈ నెలాఖరునాటికి తొలి స్కూటర్‌ను రెండు వేరియంట్లలో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది బౌన్స్ కంపెనీ. ఆ త‌ర్వాత‌ ప్రీ బుకింగ్ కూడా ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ల డెలివరీ ప్రారంభం చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.

ప్రీ బుకింగ్‌లో లక్ష వరకూ ఆర్డర్లు వస్తాయనేది కంపెనీ అంచనా. బ్యాటరీతో కలిపి వాహనం ధర 70 వేలలోపుంటుంది. బ్యాటరీ లేకుండా 50 వేలలోపు ఉండనుంది. బ్యాటరీతో పాటు తీసుకుంటే పోర్టల్ చార్జర్ ద్వారా ఇంటి వద్దే చార్జింగ్ చేసుకునే వీలుంటుంది. అదే బ్యాటరీ లేని వేరియంట్ తీసుకుంటే మాత్రం బ్యాటరీస్ యాజ్ ఎ సర్వీస్ విధానంలో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న చార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చు.

హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పూణె వంటి ఆరు నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లు (Battery Exchange Stations) ఏర్పాటు కానున్నాయి. తొలిదశలో రాజస్థాన్‌లోని (Rajasthan) భివాడీ ప్లాంటులో ఈ స్కూటర్లు ఉత్పత్తి కానున్నాయి. ఒక దీనికి సంబంధించిన రెండో లొకేషన్ ఎక్కడ పెట్టాలనేది కంపెనీ ఆలోచిస్తోంది. భివాడీ ప్లాంటు సామర్ధ్యం ఏడాదికి 1.8 లక్షల స్కూటర్లు కాగా 3-4 నెలల్లో ఈ ప్లాంటు ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: పద్మా అవార్డుల ప్రదానోత్సవం.. పీవీ సింధుకు ప‌ద్మ‌భూష‌ణ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement