Sunday, May 5, 2024

స్టోరీ విని నో చెప్పేద్దాం అనుకున్న‌…

ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ నెల 11న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పాన్‌ ఇండియా సినిమా. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. హీరో ప్రభాస్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెదనాన్న (కృష్ణంరాజు) పరమహంస పాత్రలో కనిపిస్తారు. గోపీకృష్ణ మూవీస్‌లో పెదనాన్నతో కలిసి నేను బిల్లా చిత్రంలో నటించాను. ఈసారి రాధేశ్యామ్‌తో ఆయనకు హిట్‌ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇద్దరం రెండు సీన్లలో కలిసి నటించాం. అన్నీ తెలిసిన బుద్దుడు ఆయన. కానీ మాటల్లో ఒక వెటకారం కనిపిస్తుంది. అలా ప్లాన్‌ చేశారు మా దర్శకుడు రాధ. ఇక తన పాత్ర కోసం గడ్డం పెంచాలని దర్శకుడు అన్నారు. నన్నే పెదనాన్నతో మాట్లాడమనేవారు. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా మాట్లాడేవారు. పెదనాన్ని చాలా జోవియల్‌గా ఉంటారు. ఆయనకు ఉన్న ఇమేజ్‌ వేరేది కానీ సరదాగా ఉంటారు. ఇలా చేయనా, కర్ర ఇలా పట్టుకోనా అని అడిగేవారు.

రాధేశ్యామ్‌లో అభిమానులు మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. వారికి యాక్షన్‌ సీన్స్‌ కావాలి. సుమారు 12 నిమిషాల నిడివి ఉన్న ఛేజ్‌ సీన్స్‌ ఇందులో ఉన్నాయి. అవి వారికి నచ్చుతాయని భావిస్తున్నాను. దర్శకుడు రాధాకృష్ణ కథ చెబుతాడని వంశీ ప్రమోద్‌ చెప్పారు. రమ్మనమని అన్నాను. ఇది ఫామిస్ట్‌కు సంబంధించిన కథ అనిఅన్నారు. పైగా లవ్‌స్టోరీ అన్నారు. కథ విని నో చెప్పేద్దాం అనుకున్నా. ఇంటర్వెల్‌ తర్వాత విన్నాక ఇదేదో బావుందే అనిపించింది. ద్వితీయార్థం వింటుంటే అందులో లీనమయ్యా. చిత్ర నిర్మాణం సుదీర్ఘంగా జరిగిన మాట నిజమే. కోవిడ్‌ కారణంగా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది. ప్రమోషన్‌ ప్రారంభించాక కూడా ఈ పరిస్థితి ఎదురైంది. అమితాబ్‌ గారు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఆయనతో నటించిన అనుభవం చాలా గొప్పది. వయసుకు సంబంధం లేదు. ఎంతో ఉత్సాహంగా, చురుకుగా షూటింగ్‌లో పాల్గొనేవారు. అమితాబ్‌తో నటించాలనే కోరిక తీరింది. మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు థమన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీంద్ర, దర్శకుడు రాధాకృష్ణ పాల్గొని సినిమా గురించి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement