Thursday, May 2, 2024

‘‘కృష్ణ వ్రింద విహారి’’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

నాగ శౌర్య తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించేసింది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 22న విడుదల చేస్తామని వెల్లడించారు మేక‌ర్స్. ఈ సందర్బంగా ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదల చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య, షిర్లీ సెటియా స్కూటర్‌పై వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో ఉన్నారు.

ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మి స్తుండగా, శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్యతో పాటుగా రాధిక, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement