Sunday, May 5, 2024

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ తీరుకి వ్య‌తిరేంగా.. గెట్ అవుట్ ర‌వి పోస్ట‌ర్లు

బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో స‌భ‌ను ఉద్దేశించి త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ ఎన్ ర‌వి మాట్లాడ‌గా…ఆ ప్ర‌సంగంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ద్రవిడియన్‌ మాడల్‌ అన్న పాయింట్‌ను చదవకుండా వదిలేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వం అందజేసిన ప్రసంగం కాకుండా సొంతంగా మాట్లాడటంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సీఎం స్టాలిన్‌ లేచి.. గవర్నర్‌ ఉపన్యాసం పక్కదారి పట్టించేలా ఉన్నదని అన్నారు. దీంతో ఆర్‌ఎన్‌ రవి తన ప్రసంగాన్ని ఆపేసి సభ నుంచి వాకౌట్‌ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఈ వ్యవహారం షాక్‌కు గురిచేసింది.

అనంతరం సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు అన్న పదాన్ని గవర్నర్‌ పలకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా ఇక్కడి ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్‌ రికార్డు చేయాలని, గవర్నర్‌ ప్రసంగంలోని అభ్యంతర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించింది.కాగా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిన్న శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌వ‌ర్తించిన తీరుకు నిర‌స‌న‌గా.. చెన్నైలోని వ‌ల్లూవ‌ర్ కొట్టాం, అన్నా సాలాయి ప్రాంతాల్లో ఆర్ఎన్ ర‌వికి వ్య‌తిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గెట్ అవుట్ ర‌వి అంటూ పోస్ట‌ర్ల‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement