Saturday, April 27, 2024

ఏపీకి రావాలంటే ఈ-పాస్ మస్ట్… దరఖాస్తు చేసుకునే విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రస్తుతం పగటి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏపీకి వచ్చేవారికి ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సడలింపు ఇవ్వడానికి ‘ఈ’ అమలు చేస్తున్నారు.  అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ-పాసులను జారీ చేస్తోంది. సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవడానికి పోలీసు శాఖ ఆన్‌ లైన్‌ ప్రక్రియ తీసుకొచ్చింది.

ఏపీ నుంచి దూర ప్రాంతాలకు, దూరప్రాంతాల నుంచి ఏపీకి.. రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకున్న వారికి అత్యవసరం కారణాలను బట్టి ఈ పాస్‌లు జారీ చేస్తారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎవరికైనా పాస్‌లు అవసరమైతై ఆన్‌ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలించి, పాస్‌ల జారీ చేసే ప్రక్రియ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నుంచి నడుస్తోంది. ప్రత్యేకంగా ఒక నోడల్‌ అధికారిని నియమించారు. ఈ పాస్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలన్నారు. పాస్‌లు అవసరమైన వారు పూర్తి ఆధారాలను, ధ్రువీకరణ పత్రాలను కూడా జత చేయాలని డీజీపీ కోరారు.

పాస్ దరఖాస్తు చేసుకునే వారు citizen.appolice.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ apply ePass for movement during lockdown అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే ఈ దరఖాస్తు కనిపిస్తుంది. దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబరు, గుర్తింపు ధ్రువీకరణ పత్రం, ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. ఏ కేటగిరీ కింద ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్‌ వద్ద టిక్‌ మార్క్‌ పెట్టాలి. రాష్ట్రంలోనే ప్రయాణించాలనుకుంటున్నారా? బయటకు వెళ్లాలనుకుంటున్నారా? బయటి రాష్ట్రం నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. సంబంధిత బాక్స్ వద్ద టిక్ చేయాలి. దరఖాస్తుదారు ప్రస్తుత అడ్రస్‌, వెళ్లాల్సిన అడ్రస్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలి. ప్రయాణం ఒకవైపునకు మాత్రమేనా, లేక రెండు వైపులా ప్రయాణం చేస్తారా? కూడా తెలియజేయాలి. ప్రయాణానికి కారణం కచ్చితంగా తెలియజేయాలి. సొంత వాహనామా.. ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారా వివరాలు నమోద చేయాలి ? ఎంతమంది ప్రయాణం చేయాలనుకుంటన్నారో? అందరి పేర్లు, మొబైల్ నంబర్లు, గుర్తింపు కార్డు నంబర్ కూడా ఇవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డుల్లో ఏదో ఒక దాన్ని ధ్రువీకరణపత్రంగా చూపించాలి.

ఇదీ చదవండి: రుయా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement