Sunday, April 28, 2024

గంటకు 1200 కి.మీ. వేగంతో నడిచే హైస్పీడ్ రైలు

భవిష్యత్‌ ప్రయాణంలో అతి త్వరగా గమ్యస్థానాలకు చేరే అంశంపై వర్జిన్ హైపర్ లూప్ కంపెనీ ఆశలు కలిగిస్తోంది. ఈ మేరకు హైస్పీడ్‌తో నడిచే రైలును సదరు కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ కంపెనీ అమెరికాలో ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1200 కి.మీ గమ్యస్థానాన్ని కేవలం గంట వ్యవధిలో చేరవచ్చు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలులో వెళ్లాలంటే దాదాపు ఒక రోజు పడుతుంది. ఒక వేళ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చినా నాలుగైదు గంటల సమయం పడుతుంది. కానీ ఈ హైపర్ లూప్ ట్రైన్ అయితే గంటన్నరలో వెళ్లిపోవచ్చు. హైపర్‌‌‌‌లూప్ రైలు అనేది అయస్కాంత శక్తితో పని చేసే వ్యాక్యూమ్ ట్రైన్. 2014లో స్పేస్‌‌ ఎక్స్ మాజీ సైంటిస్ట్ జాష్ జిగెల్, సారా లూషియన్ కలిసి ఈ వర్జిన్ హైపర్‌‌‌‌లూప్ కంపెనీని ప్రారంభించారు. అడ్వాన్స్డ్ ట్రావెల్ సిస్టమ్‌‌ డెవలప్ చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ నాటి నుంచి వర్క్ చేస్తోంది. 2019 నాటికి ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చాయి.

దీంతో అమెరికాలోని లాస్‌‌ వెగాస్‌‌ సమీపంలో ఉన్న నెవడా ఎడారిలో హైపర్‌‌‌‌లూప్ కన్‌‌స్ట్రక్షన్‌‌ను ఆ కంపెనీ మొదలుపెట్టింది. ట్రైన్ పట్టాల మీద నడిచినట్టే.. హైపర్‌‌‌‌లూప్ ట్రావెల్ సిస్టమ్‌‌లో కూడా భారీ ఐరన్ ట్యూబ్‌‌ ట్రాక్‌‌లా ఉంటుంది. దానిలోనే చిన్న సైజు మెట్రో కోచ్‌‌లాంటివి హైస్పీడ్‌‌తో దూసుకెళ్తాయి. దీనిలో ఒకేసారి 28 మంది ప్రయాణం చేసే వీలుంటుంది. గత ఏడాది నవంబర్‌‌‌‌లో హైపర్‌‌‌‌లూప్‌‌లో టెస్ట్ రన్‌‌ కూడా నిర్వహించి, ఆ సంస్థ సక్సెస్ అయింది. భారత్‌లోనూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని వర్జిన్ హైపర్ లూప్ కంపెనీ సమాలోచనలు చేస్తోంది. కాగా ఈ ప్రాజెక్టు పనులు అమెరికాతో పాటు దుబాయ్‌లోనూ ఒకేసారి చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement