Thursday, May 16, 2024

పిశాచి2 టీజ‌ర్-నో డైలాగ్ -ఓన్లీ హ‌ర్ర‌ర్

2004లో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘పిశాచి’ చిత్రానికి సీక్వెల్‌గా పిశాచి2 చిత్రం తెర‌కెక్కింది. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని రెండేళ్ళ క్రిత‌మే ద‌ర్శ‌కుడు మిష్కిన్ అనౌన్స్ చేశాడు. క‌రోనా కార‌ణంతో షూటింగ్ ఆల‌స్య‌మవుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఆండ్రీయా దెయ్యంలాగా ప‌రిచ‌య‌మ‌వుతూ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. 1 నిమిషం 8 సెకన్ల నిడివి గ‌ల ఈ టీజ‌ర్ అత్యంత భ‌యానికంగా ఉంది. కార్తీక్ రాజా నేప‌థ్యం సంగీతం ఒక‌వైపు థ్రిల్ ఫీల్‌ను క‌లుగజేస్తూనే మ‌రోవైపు భ‌యానికి గురిచేస్తుంది. శివ శాంత‌కుమార్ కెమెరా వ‌ర్క్ అద్భుతంగా ఉంది. రాక్‌ఫోర్ట్ ఎంట‌ర్టైనమెంట్ ప‌తాకంపై టి. మురుగ‌నాంత‌న్ నిర్మిస్తున్నాడు. ఆండ్రీయా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి, పూర్ణ‌, కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement