Monday, April 29, 2024

Celebrity Pets: పెట్ లవర్స్ ఈ సెలబ్రిటీలు.. వీటిలో ఎవరి పెట్ బాగుందో చెప్పండి..

పెట్స్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. వాటితో ఉండే రిలేషన్ అంతా ఇంతా కాదు. పెట్స్ తో ఉండే సహవాసం వల్ల కలిగే ఆనందానికి ఏదీ సరిపోదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా.. ఎటైనా టూర్ వెళ్లినా.. ఇంటికొచ్చే సరికి పెట్స్ ని  చూడగానే ఎంతో రిలీఫ్ ఉంటుంది. అవి దగ్గరకొచ్చి ఆప్యాయంగా మనల్ని పలకరిస్తున్న తీరు బాధలన్నీ మరిచిపోయేలా చేస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది పెట్స్ ని సోషల్ స్టేటస్ గా భావిస్తున్నారు. లోన్లీగా ఉన్నా.. బోర్ ఫీల్ అయినా వాటితో ఆడుకోవడంతో రిలీఫ్ పొందుతున్నారు.

ఇక.. బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే పెట్స్ పెంపకంలో వారి ఆనందానికి అంబాసిడర్‌లు కావచ్చు. తరచుగా వారి పెట్స్ తో ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటే మిలియన్ల మంది లైక్స్, కామెంట్స్ తో Instagramలో  రచ్చ రచ్చ చేస్తుంటారు. వీటిలో ఫన్నీ వీడియోల నుండి అందరినీ ‘‘అయ్యో’’ అనిపించేలా ఉండేవి కూడా చాలామటకు ఉంటాయి. చాలామంది సినీ రంగ ప్రముఖులు తమ పెట్ తో వారికున్న అనుబంధాన్ని తెలియజేసే ఉన్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితీ వీటిలో కొన్ని ప్రముఖులు, వారి -అందమైన పెంపుడు జంతువులను చూద్దాం..

1. కార్తిక్ ఆర్యన్

పెట్ పేరెంట్ క్లబ్‌లోకి తాజాగా ప్రవేశించిన నటుడు కార్తీక్ ఆర్యన్. తన కుటుంబంలోకి ఓ పెట్ డాగ్ ని ఇన్ వైట్ చేశారు.  దానికి కటోరి ఆర్యన్ అని పేరు కూడా పెట్టారు. కార్తీక్ ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కటోరికి సంబంధించిన రెండు ఫొటోలను షేర్ చేశారు. మొదటి ఫొటోలో అతను కుక్కపిల్లని తలపై పెట్టుకుని నవ్వుతున్నాడు. రెండో ఫొటోలో ఆర్యన్ పొట్టపై అది ​​రిలాక్స్ అవుతోంది. కాగా, క్యాప్షన్‌లో కార్తీక్ ఆర్యన్, “కటోరి, నేను లవ్ లో  ఉన్నాం” అని రాశాడు. దాని సొంత ఇన్‌స్టాగ్రామ్ పేజీని “కటోరి ఆర్యన్” హ్యాండిల్‌తో ట్యాగ్ చేశాడు.

2. ప్రియాంక చోప్రా

- Advertisement -

సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా పెంపుడు కుక్క డయానాకు తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇమేజ్ (ఫిబ్రవరి 5, 2022 నాటికి) ఆమె పెంపుడు జంతువుతో చాలా ఫొటోలు ఉన్నందున దానిపై ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. డయానాతో పాటు, ప్రియాంక చోప్రా.. నిక్ జోనాస్ కూడా జినో, పాండా అనే మరో రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. డయానా, ప్రియాంక చోప్రా జంటగా ఉండే వీడియో ఇక్కడ చూడొచ్చు.

3. హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ ఇటీవల ఒక కుక్కపిల్లని దత్తత తీసుకుని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో దాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అతను తన లవ్లీ డాగ్ కి మోగ్లీ అని పేరు పెట్టాడు.  సోషల్ మీడియాలో కూడా దీనికి ఫాలోయింగ్ ఉంటుందని చెప్పాడు. ఈ కుక్కపిల్ల కారు కింద కనిపించిందని మోగ్లీ గురించి పరిచయం చేస్తూ చెప్పుకొచ్చాడు హృతిక్.. కాగా, క్యాప్షన్‌లో “దత్తత”,  “ఇండీ పప్” అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేశాడు.

4. మాధురీ దీక్షిత్

మాధురీ దీక్షిత్ కూడా తన పెంపుడు కుక్క ఫొటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఉదాహరణకు ” నా స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు” అనే శీర్షికతో అందమైన కుక్క ఆరాధ్య ఫొటోను షేర్ చేసింది.

5. అర్జున్ కపూర్

తన పెంపుడు కుక్క మాగ్జిమస్‌తో అర్జున్ కపూర్ రిలేషన్ ఎంతో బాగుంది.  ఈ యాక్టర్ తరచుగా బ్రిటిష్ బుల్ డాగ్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేసుకుంటాడు. అర్జున్, తన కుక్కతో సరదాగా గడిపినట్లు చూపించే వీడియోలో “ఇది మాగ్జిమస్ ప్రపంచం. మేము ఆ ప్రపంచంలో జీవిస్తున్నాం ” అని చెప్పుకొచ్చాడు.

అర్జున్ గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరా తన పెంపుడు కుక్క కాస్పర్‌తో తరచుగా ఫొటోలు షేర్ చేసుకునే మరో ప్రముఖ వ్యక్తి. మలైకా అరోరా యోగా సెషన్‌లు, రీల్స్ ను గేట్‌క్రాష్ చేస్తూ కనిపించింది. స్టార్ వర్కౌట్ రొటీన్‌లో క్యాస్పర్ చేరిన ఈ వీడియోను చూడండి.

6. కృతి సనన్

నటి కృతి సనన్ ఎంతో గర్వంగా ఫీలయ్యే కుక్క మమ్మా. దీన్నీ నిరూపించడానికి తన పెంపుడు జంతువుతో ఉన్న పొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో విపరీతంగా పోస్టు చేస్తుంటుంది. తన పెంపుడు కుక్క పుట్టినరోజును బంతితో ఆడుకునే వీడియోతో జరుపుకుంది. “నా సంతోషాల మూట. అందుకే నేను దాన్ని బాగా ప్రేమిస్తున్నా ” అని కృతి సనన్ రాసుకొచ్చింది.

7. దిశా పటాని

దిశా పటానీ జంతు ప్రేమికురాలు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్స్ తో దిగిన ఎన్నో ఫొటోలున్నాయి. ఆమెకు బెల్లా, జాస్మిన్, గోకు, కీటీ, చిచీ అనే పిల్లులు.. కుక్కలు రెండూ ఉన్నాయి. వాటికి 20,000 మంది ఫాలోవర్లతో అంకితమైన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది.

8. వరుణ్ ధావన్

వరుణ్ ధావన్‌కి తన పెంపుడు జంతువు బీగల్‌పై ఉన్న ప్రేమ అతని సోషల్ మీడియా పోస్ట్ లలో స్పష్టంగా కనిపిస్తుంది. జోయి అని పేరుతో  ఉన్న తన డాగ్ ని ఎంతో మురిపంగా చూసుకుంటాడు. పనిమీద వెళుతున్నప్పుడు అది అతడిని విడిచిపెట్టకుండా అతుక్కుపోతూ ఉంటుంది. కుక్కకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, దానికి ఇతర ఆదేశాలను పాటించడం నేర్పుతున్న వీడియోను వరుణ్ షేర్ చేశాడు.

9. విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ పెంపుడు జంతువు హస్కీ.. ఇది తన జీవితంలో అంతర్భాగం. ఇది తరచూ తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలలో కనిపిస్తుంది. ఇటీవల విజయ్ కుటుంబంతో కలిసి ఫస్ట్ టైమ్ విమానంలో ప్రయాణించింది. కుక్క తన సీటులో సేఫ్ గా కనిపించిన వీడియో ఉంది.  ఆ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ..“ఈ జెంటిల్‌మన్ మొదటి విమాన ప్రయాణం” విజయ్ తెలిపాడు.

 10. అలియా భట్

బాలీవుడ్‌లో పెట్స్ లవర్స్ కి కొదువ లేకపోయినా.. అలియా భట్ నమ్మకమైన పిల్లిని పెంచుకుంటోంది. తరచుగా తన పెంపుడు జంతువులతో అలియా కనిపిస్తుంది. – తెలుపు పెర్షియన్ పిల్లి ఎడ్వర్డ్, జునిపెర్, నల్లటి బొచ్చుతో అందమైన కోటుతో ఉంది. అలియా భట్, ఎడ్వర్డ్ మంచం మీద పడుకున్న ఫొటో ఇక్కడ ఉంది..

అయితే ఈ పదిమంది సెలబ్రిటీల్లో ఎవరి పెంపుడ జంతువులు బాగున్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement