Saturday, April 20, 2024

హిందీలో కూడా రిలీజ్ కానున్న ‘ఖిలాడి’

హిందీలో తెలుగు చిత్రాల‌కు య‌మా క్రేజ్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సినిమా హిందీలో వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించిన సంగ‌తి తెలిసిందే. దాంతో తెలుగుతో పాటు హిందీలోను తమ సినిమాలు విడుదలయ్యేలా హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అదే బాటలో ఇప్పుడు ‘ఖిలాడి’ కూడా ముందుకు వెళుతోంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ముందుగా ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను హిందీలోను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement