Saturday, May 4, 2024

త‌మిళ హిట్ చిత్రం తెలుగు రీమేక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్, సాయిధ‌ర‌మ్ తేజ్ !

త‌మిళ హిట్ చిత్రం వినోదాయ‌సితం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ చిత్రం గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో వ‌చ్చి విజ‌యాన్ని సాధించింది. కాగా ఈ చిత్రానికి న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట‌ర్. అంతేకాదు ఆయ‌నే ప్ర‌ధాన పాత్ర‌ని పోషించ‌డం విశేషం. సముద్రఖని ఈ కథను ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ కి వినిపించి .. సినిమా చూపించార‌ట‌. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ ఉత్సాహాన్ని చూపించారనే టాక్ వచ్చింది. పవన్ తో పాటు మరో ముఖ్యమైన పాత్రను ఈ సినిమాలో హీరో సాయితేజ్ చేయనున్నాడనేది తాజా సమాచారం. ఆయనకి మంచి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement