Thursday, May 2, 2024

‘ఊ అంటావా మావా, ఉ.. ఊ అంటావా’.. వారి స‌న్నాయి రాగం మారింది..

సంక్రాంతి పండుగ వ‌స్తోంది.. కొత్త వ‌డ్లు, ధాన్యం ఇంటికి చేరి.. రైతులు సంతోషంగా ఉంటారు. కొత్త అల్లుళ్లు, ఆడ‌ప‌డుచులు ఇంటికి చేరి ఇంటిల్లిపాది సంబురాలు జ‌రుపుకుంటారు. అయితే ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జ‌రుపుకుంటారు. కొన్ని చోట్ల ఆచార వ్య‌వ‌హారంగా కూడా అల్లుళ్ల‌ను పిలిచి వారి కోర్కెలు తీరుస్తుంటారు.. అయితే ఈ టైమ్‌లోనే ఇంటింటా తిరుగుతూ భిక్ష తీసుకునేందుకు బాల‌సంతులు, గంగిరెద్దులు ఆడించే వారు.. హ‌రిదాసులు వ‌స్తుంటారు. అయితే వీరిలో గంగిరెద్దులు ఆడించే వారు ఉపాధి లేక ఇంటింటికీ బ‌స‌వ‌న్న‌ను తీసుకుని వ‌స్తూ.. గేటు ముందు పాట‌లు పాడి ఆ ఇంటివారిని భిక్ష అడిగి మ‌రీ తీసుకుంటున్నారు.

అయితే ఈ మ‌ధ్య పుష్ప సినిమాలో ఫేమ‌స్ అయి.. అంద‌రి నోట నానుతున్న ఓ పాట గంగిరెద్దుల వారి స‌న్నాయి రాగంగా మారింది.. ఇంటింటికీ వెళ్లి.. ఉ అంటావా మావా.. ఉ.. ఊ అంటావా మావా.. అనే పాట స‌న్నాయి ద్వారా పాడుతున్నారు. ఇంత‌కుముందు పాత పాట‌లు పాడే వారు ఇప్పుడు స‌మాజానికి త‌గ్గ‌ట్టు అప్ డేట్ అయ్యార‌ని, ప‌ల్లె నుంచి ప‌ట్నం దాకా అంద‌రూ వారి పాట విని ముచ్చ‌పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement