Monday, May 6, 2024

ఏపీలో థియేట‌ర్ య‌జ‌మానుల‌కు ఊర‌ట‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యజమానులకు ప్రభుత్వం ఊరట ఇచ్చిం ది. రాష్ట్రవ్యాప్తంగా మూసేసిన థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతిస్తూ థియేటర్‌ లైసెన్స్‌ల పునరుద్ధరణకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఈలోగా జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల నుంచి అనమతులు తీసుకొని థియేటర్లు నిర్వహించుకోవచ్చంటూ సూచించింది. అధికారులు మాత్రం ఇంకా తమకు ఆదేశాలు రాలేదని, అందగానే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నట్లు ఎగ్జిబిటర్లు చెపుతున్నారు.

సినీ టిక్కెట్ల పెంపుతో మొదలైన వివాదం థియేటర్ల తనిఖీ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని థియేటర్లను మూడు రోజుల పాటు రెవిన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో లైసెన్స్‌ల పునరుద్ధరణ, టిక్కెట్ల రేట్ల పెంపు, ప్రేక్షకులకు సౌక ర్యల కల్పన, షోల నిర్వహణ, క్యాంటీన్ల ధరలపై పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొంటూ 85 థియేటర్లను సీజ్‌ చేయగా, అధికారుల తనిఖీల తీరును తప్పుబడుతూ 50కి పైగా థియేటర్లను యజమానులు స్వచ్ఛందంగా మూసేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement