Saturday, April 27, 2024

మళ్లీ పెరగనున్న ఉల్లిపాయల ధరలు

దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా ఉల్లిపాయల ధరలు త్వరలోనే మరోసారి రెట్టింపు కానున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ వెల్లడించింది. భారత్‌లో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోందని.. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోందని క్రిసిల్ తెలిపింది.

మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారని.. అయితే ఇటీవల సంభవించిన తుఫానుల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైందని.. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికి అందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్‌ అభిప్రాయపడింది. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారని.. ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్‌ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్‌ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement