Wednesday, May 1, 2024

అమెజాన్ లో – ప‌లాస అమ్మాయికి ఉద్యోగం – రూ.44ల‌క్ష‌ల వార్షిక వేత‌నం

ప్ర‌ముఖ ఈ – కామ‌ర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగానికి ఎంపిక‌యింది శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌కు చెందిన అమ్మాయి స్నేహ‌కిర‌ణ్. రూ.44లక్ష‌ల వార్షిక వేత‌నంతో ఈ ఉద్యోగానికి ఎంపికయిందామె. కాగా తండ్రి సింహాచలం స్థానిక జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, తల్లి సుభాషిణి గృహిణి. స్నేహ ప్రస్తుతం విశాఖపట్టణంలోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్, సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతోంది. గణితంపై చిన్నప్పటి నుంచే పట్టు సంపాదించిన స్నేహ కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకుంది. స్నేహితులతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేసేది. అమెజాన్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ఇవన్నీ తనకు కలిసొచ్చాయని స్నేహ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement