Monday, December 9, 2024

ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు ఇవే .. డాక్ట‌ర్ ఏంజెలిక్ కొయెట్జీ ..

ఒమిక్రాన్ తో తీవ్ర‌మైన జ‌బ్బు ల‌క్ష‌ణాలు ఉండ‌వ‌ని సౌత్ ఆఫ్రికా మెడిక‌ల్ అసోసియేష‌న్ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ ఏంజెలిక్ కొయెట్జీ తెలిపారు. ఒళ్లునొప్పులు, త‌ల‌నొప్పి, తీవ్ర‌మైన అల‌స‌ట లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని వివ‌రించారు. వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవన్నారు. ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైన జ్వరమూ ఉండద‌ని తెలిపారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ తో వచ్చే లక్షణాల తీవ్రత చాలా తక్కువని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో చేరే ముప్పు చాలా తక్కువేనని, ఇంట్లోనే నయం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం యువతలోనూ ఇది ప్రభావం చూపిస్తోందని, అయితే, యువతపైనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని ఇప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికీ ఒమిక్రాన్ సంక్రమించడంపైనా ఆమె మాట్లాడారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి అది సోకినా.. వ్యాక్సిన్ వేసుకోనివారితో పోలిస్తే రక్షణ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement