Saturday, May 4, 2024

సింగపూర్‌లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌, 50కి పైగా దేశాలకు వ్యాప్తి..

ఒమిక్రాన్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ కేసులు సింగపూర్‌లో నమోదయ్యాయి. 198.. బీఏ.2 వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. బీఏ.1 వేరియంట్‌తో పోలిస్తే.. బీఏ.2 వేరియంట్‌ లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నాయని సింగపూర్‌ వైద్య నిపుణులు తెలిపారు. వ్యాప్తిలో కూడా ఒమిక్రాన్‌ను పోలి ఉందని వివరించారు. వేలాది మందికి ఒమిక్రాన్‌ సోకుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికల్లేవని చెప్పారు. జనవరి 25 నుంచి మొత్తం 150 బీఏ.2 కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే. 48 మంది స్థానికులు. రోగ నిరోధక శక్తిని తప్పించుకునే లక్షణాలు.. వ్యాప్తి.. తీవ్రత వంటి వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కూడా.. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ను గమనిస్తూనే ఉంది. బీఏ.1 మ్యూటేషన్‌ నుంచే బీఏ.2 సబ్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చింది. స్పైక్‌ ప్రోటీన్‌లో కూడా మార్పులు ఉన్నాయి. సుమారు 50కు పైగా దేశాల్లో.. బీఏ.2 వేరియంట్‌ వెలుగు చూసింది. డెన్మార్క్‌, యూకేలో తీవ్రత ఎక్కువగా ఉంది. సింగపూర్‌లో తాజాగా 5,554 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 282 మంది విదేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ముగ్గురు చనిపోయారు. ఇప్పటి వరకు 3,38,625 మంది కరోనా బారినపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement