Saturday, May 18, 2024

రేపు యూపీలో మోడీ ర్యాలీ.. ఫేజ్‌-1 జిల్లాలపై ఫోకస్‌.. వర్చువల్‌ ర్యాలీకి మోడీ హాజరు

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల్లో భాగంగా నిర్వహించే వర్చువల్‌ ర్యాలీలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. రేపు (సోమవారం) ఈ ర్యాలీ ఉంటుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులు, పథకాల గురించి వివరిస్తారు. ఫేజ్‌-1లో భాగంగా ఎన్నికలు జరిగే జిల్లాలపై మోడీ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తున్నది. యూపీలోని పశ్చిమ జిల్లాల్లో ఫిబ్రవరి 10 నుంచి పోలింగ్‌ ప్రారంభం అవుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ తీసుకొచ్చిన ఆంక్షలు 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. మోడీని ఎన్నికల ప్రచార రంగంలోకి దించాలని నేతలు భావిస్తున్నారు. ఫేజ్‌1 ఓటింగ్‌కు ఇంకా 10 రోజుల సమయం మిగిలి ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో పాల్గొనలేదు. మోడీ వర్చువల్‌ ర్యాలీని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నాలుగు నుంచి ఐదు జిల్లాల్లో దీని ప్రసారం చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సహరన్‌పూర్‌, బాగ్‌పత్‌, శావ్లీు, ముజఫర్‌నగర్‌తో పాటు గౌతమ్‌ బుద్ధ నగర్‌లో ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ వర్చువల్‌ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. 21 అసెంబ్లిd స్థానాలను కవర్‌ చేయనున్నారు. ప్రతీ మండలంలో ఓ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తారు. ఒక్కో స్క్రీన్‌ వద్ద 500 మంది వీక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఈ లైవ్‌ కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement