Wednesday, May 15, 2024

Exclusive | ధూప, దీప నైవేద్యానికి మహర్దశ.. అలవెన్స్​, వేతనం 10వేలకు పెంచిన సీఎం కేసీఆర్​

తెలంగాణలో ధూప, దీప నైవేద్యం (డీడీఎన్‌) పథకం కింద అర్చకులకు అందించే అలవెన్స్​ను ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఇవ్వాల (మంగళవారం) ఈ ఉత్తర్వులు జారీ అయినట్టు తెలుస్తోంది. పురాతన కాలం నుంచి, ఆ తర్వాత వెలిసిన ఆలయాల్లో నిత్యం ఆ దేవుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించేందుకు అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన ప్రభుత్వం నిధులు కేటాయించింది. కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో అంతకుముందు ఉన్న రూ.2500 అలవెన్స్​ను రూ.6వేలకు పెంచి అమలు చేస్తోంది. ఈ మొత్తంలో ధూప, దీప నైవేద్యానికి రూ 2వేలు, అర్చకుడికి రూ 4వేలు వేతనం ఇస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో బ్రాహ్మణ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా డీడీఎన్‌ కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా, ఇందులో అర్చకులకు 6వేల రూపాయలు, ధూప, దీప నైవేద్యాలకు 4వేల రూపాయలను కేటాయించారు. ఈ పథకాన్ని మరికొన్ని దేవాలయాలకు కూడా వర్తింపచేస్తామని సీఎం చేసిన ప్రకటన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం అందుతోంది. భృతిని పొందే అర్హత వయసు 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు సీఎం కేసీఆర్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement