Sunday, May 19, 2024

అణు విద్యుత్ కు అంద‌లం – విదేశీ పెట్టుబ‌డుల‌కు గ్రీన్ సిగ్నల్ …

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అణు విద్యుత్‌ పరిశ్రమల్లో విదేశీ పెట్టు-బడులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆలోచన చేస్తోంది. క్లీన్‌ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ రంగంలో ఎక్కువ మంది దేశీయ ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించబోతున్నట్లు- కేంద్రంలోని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని థింక్‌-ట్యాంక్‌ నీతి ఆయోగ్‌ ఏర్పాటు- చేసిన ప్రభుత్వ ప్యానెల్‌ ఈ చర్యలను సిఫార్సు చేసింది. అణు విద్యుత్‌ని ప్రోత్సహించ డంపై పది అంశా లను- ఆ నివేదికలో పేర్కొంది. భారతదేశం యొక్క ప్రస్తుత అణు విద్యుత్‌ సామర్థ్యం 6,780 మెగావాట్లు- కాగా 2031 నాటికి దీనిని 7 వేల మెగావాట్ల సామర్థ్యనికి చేర్చా లన్న లక్ష్యంతో 21 యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అణు భద్రతకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పం దాలపై దేశం సంతకం చేసింది. ఈనేపథ్యంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసకి చూపే ప్రైవేట్‌ కంపెనీలు ప్రమాణాల కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కీలంగా మారింది. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం రష్యా, కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఫ్రాన్స్‌, కెనడా నుండి అణు ప్లాంట్లకు యురేనియం ఇంధనాన్ని భారతదేశం దిగుమతి చేసుకుంటు-ంది.

ఆ పది అంశాలేంటంటే..
భారతదేశ అటామిక్‌ ఎనర్జీ యాక్ట్‌ 1962 ప్రకారం అణు విద్యుత్‌ కేంద్రాలను అభివృద్ధి చేయడం, అమలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని ప్రకారం దేశీయ ప్రైవేట్‌ కంపెనీలు అందుకు అవసరమైన విడి భాగాలను సర ఫరా చేయడం మరియు వాటిని నిర్మించడంలో సహాయం చేయడం ద్వారా జూనియర్‌ ఈక్విటీ- భాగస్వాములు గా పాల్గొనడానికి అనుమతించబడతాయి. తాజా చర్యలో, నీతి ఆయోగ్‌ ప్యానెల్‌ చట్టానికి, భారతదేశ విదేశీ పెట్టు-బడి విధా నాలకు మార్పులను సిఫార్సు చేసింది. తద్వారా దేశీయ మరియు విదేశీ ప్రైవేట్‌ కంపెనీలు ప్రభుత్వ సంస్థలచే అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తి చేయగలవని నివేదిక పేర్కొంది. వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌, జిఇ-హిటాచీ, ఎలక్ట్రిసిట్‌ డి ఫ్రాన్స్‌ (ఇడిఎఫ్‌.పిఎ), రోసాటమ్‌తో సహా అనేక విదేశీ కంపెనీలు సాంకేతిక భాగస్వాములు, సరఫరాదారు లు, కాంట్రాక్టర్లు, సేవలు అందించేవిగా దేశంలోని అణు విద్యుత్‌ ప్రాజెక్టులలో పాల్గొనడానికి ఆసక్తిని కలిగి ఉన్నాయని భారత అణుశక్తి విభాగం తెలిపింది. భారతదేశ మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో 3 శాతం వాటా కలిగిన అణు విద్యుత్‌ ఉత్పత్తిని వేగవంతం చేయడాని కి మాడ్యులర్‌ రియాక్టర్ల ద్వారా ఈ ప్రైవేట్‌ భాగస్వామ్యం ప్రాధాన్యతనిస్తుందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో బొగ్గు మూడు వంతులు మేర మాత్రమే వినియోగం అవుతుంది. ఒక కర్మాగారంలో రెడీ టూ షిప్ట్‌ రూపంలో నిర్మించబడే ఎస్‌ఎంఆర్‌ 300 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేయగలదు. ఇందుకోసం సాంప్రదాయ రియాక్టర్ల కంటే తక్కువ మూలధనం, సమయం మరియు భూమి అవసరం అవుతాయి. అంతేకాకుండా వీటిని సురక్షితంగా జనావాస ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూక్లియర్‌ పవర్‌ కార్ప్‌ ఆఫ్‌ ఇండియా లిమి-టె-డ్‌ (ఎన్‌పీసీఐఎల్‌), భారతీయ నభికియ విద్యుత్‌ నిగమ్‌ భారతదేశంలోని రెండు అణు విద్యుత్‌ ఉత్పత్తి దారులుగా ఉన్నాయి. థర్మల్‌ పవర్‌ కంపెనీ (ఎన్‌టీ-పీసీ.ఎన్‌ఎస్‌), చమురు మార్కెటింగ్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్ప్‌ (ఐఓసీ.ఎన్‌ఎస్‌)లు ప్రభుత్వ నియం త్రణలో ఉన్నాయి, అణు విద్యుత్‌ కోసం ఎన్‌పీసీఐఎల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నా యి. ఎస్‌ఆర్‌ఎం అభివృద్ధి చేయ డంలో దేశం ప్రైవేట్‌ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని అన్వేషించాలని గత ఏడాది నవంబర్‌లో అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ సూచించారు. రాయిటర్స్‌ నివేదికకు సంబంధించిన ఒక అధికారి మాట్లాడుతూ, నవంబర్‌ 2022లోనే అణు ఇంధన విభాగం గణనీయమైన ఆసక్తిని కనబరిచిన దేశీయ, ప్రపంచ పరిశ్రమల పెట్టుబడిదారులతో క్లోజ్డ్‌-డోర్‌ సంప్ర దింపులు జరిపింది. సరైన విధాన ప్రణాళికతో, దేశంలో ప్రైవేట్‌ రంగం గణనీయమైన విస్తరణను చేపట్టడం కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సిఫార్సులను ఆలస్యం చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి సమర్పించ నున్నట్లు- అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement