Wednesday, May 8, 2024

ఎన్టీఆర్ వీరాభిమాని – ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం 75టికెట్లు కొనుగోలు

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషిస్తున్నారు. కాగా మార్చి మార్చి 25న ట్రిపుల్ ఆర్ గ్రాండ్‌గా విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.దాంతో అభిమానుల సంతోషానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభ‌మ‌య్యాయి. బుకింగ్స్ సేల్స్ ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా అమెకారిలోని డ‌ల్లాస్ న‌గ‌రంలోని గెలాక్సీ థియేట‌ర్లో ఎన్టీఆర్ వీరాభిమాని ఏకంగా 75 టికెట్ల‌ను కొనుగోలు చేశాడు. దీన్ని బ‌ట్టి చూస్తే తార‌క్ అభిమానులు ఈ సినిమా గురించి ఎంత‌గా ఎదురుచూస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. డివివి ఎంటర్టైన‌మెంట్స్ ప‌తాకం పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాడు. ఆలియాభ‌ట్, ఒలీవియా మొర్రిస్‌లు హీరోయిన్‌లుగా న‌టించారు. అజ‌య్‌దేవ‌గ‌న్‌, శ్రియ, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీర‌వాణి సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement