Saturday, May 4, 2024

కొరటాల శివ బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన ఎన్టీఆర్

టాలీవుడ్‌లో అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ పేరు సంపాదించారు కొరటాల శివ. మర్చి సినిమాతో మొదలైన ప్రయాణం వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు.  సామాజిక కోణంలో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ వరుస విజయాలందుకున్నారు. ఇవాళ(జూన్ 15) కొరటాల శివ బర్త్ డే.

కొరటాల శివ పుట్టినరోజు కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ”స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ ట్వీట్‌ చేశారు.

ఎన్టీఆర్- కొరటాల మధ్య మంచి అనుబంధం ఉన్న ఉంది. గతంలో ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ సినిమా రూపొందించి సూపర్ సక్సెస్ ఇచ్చారు కొరటాల శివ. గతంలో బృందావనం సినిమాకు కథ రచియితగా కూగా పని చేశారు. మళ్ళీ ఈ ఇద్దరి కాంబోలో  కొత్త సినిమా రాబోతోంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇటివల చేసిన సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను వచ్చే యేడాది  ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement