Friday, May 17, 2024

నటి నేహాల్‌ షా బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. పక్కా ప్లాన్ తో అరెస్ట్..

బర్త్​డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్‌ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన స్నేహితులతో పార్టీ జరుగుతుండగానే పోలీసులు పక్కా సమాచారం మేరకు.. రైడ్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ కూడా హాజరయ్యాడు. వీరిద్దరూ మాదకద్రవ్యాలు సేవించారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నటి నైరా నేహాల్‌ షాతో పాటు ఆమె స్నేహితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంపై విచారణ జరుపుతున్నారు. అలాగే వీరికి మాదకద్రవ్యాల్ని సరఫరా చేసిన వారికి కోసం గాలిస్తున్నారు. నేహాల్‌ షా పలు బాలీవుడ్‌ చిత్రలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోనూ నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement