Wednesday, May 15, 2024

తెలుగుజాతికి ఎన్టీఆర్ వెన్నెముక : బాల‌కృష్ణ

తెలుగుజాతికి ఎన్టీఆర్ వెన్నెముక అని సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ అన్నారు. మార్చేయ‌డానికి, తీసేయ‌డానికి ఎన్టీఆర్ అన్న‌ది పేరు కాద‌న్నారు. తండ్రి గ‌ద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చార‌న్నారు. కొడుకు అధికారంలోకి వ‌చ్చి యూనివ‌ర్సిటీ పేరు మార్చార‌న్నారు. మిమ్మ‌ల్ని మార్చ‌డానికి ప్ర‌జ‌లున్నార‌న్నారు. పంచ భూతాలున్నాయ్.. త‌స్మాత్ జాగ్ర‌త్త అన్నారు. అక్క‌డ ఆ మ‌హానీయుడు పెట్టిన భిక్ష‌తో బ‌తుకుతున్న నేత‌లున్నార‌న్నారు. విశ్వాసం లేని వాళ్ల‌ను చూసి కుక్క‌లు వెక్కిరిస్తున్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement