Sunday, May 19, 2024

82ఏళ్ల‌కి నోబెల్ బ‌హుమతిని సొంతం చేసుకున్న – ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్

ఫ్రాన్స్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్ ను ప్ర‌తిష్టాత్మ‌క నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ గురువారం సాయంత్రం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫ‌ర్ ద కరేజ్ అండ్ క్లినిక‌ల్ అక్యూటీ… పేరిట రాసిన పుస్తకానికి గాను ఆమెకు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. 1974లోనే ర‌చ‌న‌లు మొద‌లుపెట్టిన ఎర్నాక్స్‌… ఈ ఏడాది త‌న 82వ ఏట నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక‌య్యారు. సాహిత్యంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన‌ ఎర్నాక్స్‌… ప్ర‌ధానంగా ఆటోబ‌యోగ్ర‌ఫీలు రాశారు. త‌న త‌ల్లిదండ్రుల‌తో త‌న అనుబంధం, త‌ద‌నంత‌రం త‌న జీవితంలో చోటుచేసుకున్న ప‌రిణామాల ఆధారంగా ర‌చ‌న‌లు చేశారు. తొలుత ఫిక్ష‌న్ న‌వ‌ల‌ల‌తోనే త‌న ప్ర‌స్థానం మొదలుపెట్టినా…ఆ త‌ర్వాత ఆటోబ‌యోగ్ర‌ఫీల దిశ‌గా ఆమె మారిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement