Wednesday, May 8, 2024

రేంజ్ రోవ‌ర్ కారుని కొన్న బిత్తిరి స‌త్తి-వైర‌ల్ గా ఫొటోస్

డిఫ‌రెంట్ స్టైల్ ..త‌న‌దైన యాస‌తో యాంక‌రింగ్ లో ప్ర‌త్యేక‌మైన పేరుని తెచ్చుకున్నాడు బిత్తిరి స‌త్తి. టీవీల్లో త‌న మార్క్‌లో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూనే కొన్ని సినిమాల్లో న‌టించారు. తుపాకీ రాముడు సినిమాతో హీరోగా క‌నిపించారు. ఫుల్ బిజీగా ఉండే స‌త్తి ఇప్పుడు ఇండిపెండెంట్‌గా వ‌ర్క్ చేసుకుంటున్నారు. ఈయ‌న తాజాగా రేంజ్ రోవ‌ర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధ‌ర రూ.2.5 నుంచి రూ. 4 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. కొత్త కారుని కొన్న బిత్తిరి స‌త్తి.. ఆయుధ పూజ‌ను నిర్వ‌హించి ఆ కారుకు సంబంధించిన ఫొటోల‌ను నెట్టింట పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ కారు ఫుల్ ఆటోమేటెడ్ వెర్ష‌న్‌.పెద్ద పెద్ద సినిమాల‌కు సంబంధించిన స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూస్‌ను ఈ మ‌ధ్య‌కాలంలో బిత్తిరి స‌త్తి చేస్తున్నారు. బిత్తిరి స‌త్తి కామెడీ యాంగిల్ తో అంద‌రినీ న‌వ్విస్తూ చేస్తున్న ఈ ఇంట‌ర్వ్యూల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement