Monday, May 20, 2024

AP : అంద‌ర్ని గొడ్డ‌లితో న‌రికేయండీ…ష‌ర్మిల

- Advertisement -

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి సింగిల్ ప్లేయ‌ర్ ఉండాల‌ని వ‌దిన భార‌తి సూప‌ర్ ప్లాన్ వేశారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ఆరోపించారు.. అక్క‌డ ఆయ‌న త‌ప్ప ఎవ‌రూ గెలువ‌కూడ‌ద‌ని ఆమె కోరుకుంటున్నార‌ని చెప్పారు.. అందుకే అక్క‌డ పోటీ చేస్తున్న వారంద‌రినీ గొడ్డ‌లితో న‌రికివేస్తే , మీరే సింగిల్ ప్లేయ‌ర్ గా ఉంటారంటూ ష‌ర్మిల ధ్వ‌జ‌మెత్తారు.

క‌డ‌ప‌లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిపై వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఓట‌మి భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యార‌ని, దీనికోసం పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నార‌ని అన్నారు. ఎంపీగా ఓడితే అరెస్టు త‌ప్ప‌ద‌నే భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఉన్నార‌ని, ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే అవినాష్ ఇక ఎపిలో క‌నిపించ‌బోర‌ని ష‌ర్మిల చెప్పారు.

ఏపీ ప్రజల ‘మన్‌కీ బాత్‌’ ప్రధాని వినాలి

ఇది ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్‌గా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ ఆయన వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.

పది అంశాలతో మోడీకి ష‌ర్మిల చార్జిషీట్..

పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అని హామీ ఇచ్చారు.. ఆ తర్వాత మాట మార్చి మా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు.
జగన్ రివర్స్ టెండరింగ్ ను అడ్డుకోకపోగా పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలు చేస్తూ ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు.
నాడు మీరు భూమి పూజ చేసిన ‘అమరావతి’ పదేళ్ల తర్వాత కూడా నేటికీ నిర్మాణం పూర్తికాలేదు.
ప్రజా పోరాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రయత్నిస్తూ మళ్లీ విశాఖపై దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారు.
విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ తదితర హామీలను అమలు చేయకుండా ఏపీకి తీరని అన్యాయం చేశారు.
మీ దత్తపుత్రుడు మద్యం సిండికేటు నడుపుతూ కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీలో చలనం లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు కానీ ఏపీలో ఎలాంటి చర్యలు తీసుకోలేదేం?
దేశంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఫిర్యాదులపై ఉలుకూ పలుకు లేకుండా ఏపీ సర్కారును ప్రశ్నించకుండా, చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారు.
ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొడ్డిదారిలో ఏపీ సర్కారు చేస్తున్న అప్పులపైనా ఎలాంటి హెచ్చరికలూ లేవు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కర్నూలు వచ్చిన సీబీఐ బృందం.. శాంతిభద్రతల సమస్య పేరుతో వెనుదిరిగినా కేంద్ర ప్రభుత్వం మిన్నకుండిపోవడం యావత్ దేశానికే అవమానం.
దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మాటిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీనే మరిచిపోయారు. నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement