Sunday, May 19, 2024

AP: పాలిసెట్ ఫ‌లితాలు విడుద‌ల.. ఆన్ లైన్ ఫ‌లితాలు

విజ‌య‌వాడ – ఏపీ పాలిసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విజయవాడలో ఇవాళ‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించగా.. మే 5న ఫైనల్ కీ విడుదల చేశారు. విద్యార్థులు ఈ లింక్ ఓపెన్ చేసి హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులు పాలిసెట్ ఫలితాల కోసం polycetap.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. హోం పేజ్ లో ఉన్న ap polycet 2024 results లింక్ పై క్లిక్ చేయాలి. పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఇతర వివరాలు అడిగితే వాటిని కూడా ఎంటర్ చేశాక సబ్ మిట్ చేయండి. స్క్రీన్ పై మీ ఫలితాలు వస్తాయి. దానిని ప్రింట్ తీసుకోండి. ఇది మీ అడ్మిషన్ కు ఉపయోగపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement