Monday, April 29, 2024

జేమ్స్ బాండ్ హీరో డెనియ‌ల్ క్రెయిగ్ కి – క‌రోనా

హాలీవుడ్ న‌టుడు, జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరో డెనియ‌ల్ క్రెయిగ్ కు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. క్రెయిగ్ ఓ స్టేజ్ షోలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా… ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ ప్రదర్శనను రద్దు చేశారు. 2021లో వచ్చిన ‘ నో టైం టూ డై’ సినిమాలో బ్రిటిష్ గూడాఛారిగా నటించారు.రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అన్ని దేశాలపై దండయాత్ర చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్లగా తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. తాగాగా మరో కొత్త వేరియంట్ బ్రిటన్ లో పుట్టుకొచ్చింది. ఎక్స్ ఈ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బయటపడింది. ఓమిక్రాన్ కన్నా పదిరెట్ల వేగంతో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement