Saturday, April 27, 2024

Flash: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు 

వాహనదారులకు వరుసగా ఆరో రోజు ఊరట లభించింది. దేశంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రేటు రూ. 119.47 వద్ద, డీజిల్ ధర రూ. 105.47 వద్ద ఉన్నాయి. ఇక, ఏపీలోని గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.121.26, 106.87 వద్ద కొనసాగుతున్నాయి. కాగా, గడిచిన ఆరు రోజులుగా నిలకడగా కొనసాగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement