Saturday, April 27, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టి బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 వద్ద స్థిరంగా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉంది.

బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర రూ.40 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,960కు చేరింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త ఊరట కలిగించే అంశం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో  బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement