Saturday, April 27, 2024

నీట మునిగిన నిర్మల్.. జిల్లా మంత్రికి ఎంత శ్రద్ధ ఉందో?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వరదలు బీభీత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలతో నిర్మల్‌ పట్టణం జలమయమైంది.  నిర్మల్ లో పలు కాలనీ అంతా నీట మునిగింది. కాలనీలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. ముంపు కాలనీల్లోని ఇండ్లలో వందలాదిమంది వరదనీటిలో చిక్కుకున్నారు. నాటు పడవల సహాయంతో జనాలను బయటకు తీస్తున్నారు స్థానికులు. బైంసా డివిజన్ లో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

అయితే, జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు చెరువుల కబ్జాలతో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడతుంటే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం అధికార యంత్రంగంతో సరదాగా విహార యాత్ర వెళ్లి చేపలు పడుతున్నారని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement