Sunday, May 19, 2024

నాగ‌చైత‌న్య మ‌రో రికార్డ్ – ఇన్ స్టా గ్రామ్ లో ‘7మిలియ‌న్స్’ పైగా ఫాలోవ‌ర్స్

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు హీరో నాగ‌చైత‌న్య‌. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఆయ‌న మ‌రో మైలు రాయిని దాటాడు. నాగచైతన్య తన ఇన్‏స్టా ఖాతాలో 7 మిలియన్స్ పైగా ఫాలోవర్లను రీచ్ అయ్యాడు. దీంతో చైతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. చైతూ ఇన్‏స్టా అకౌంట్ చూస్తే అతని అభిరుచులు స్పష్టంగా అర్థమవుతుంటాయి. అతను ఎక్కువగా ఆటోమొబైల్స్.. బైక్స్.. కార్స్ గురించి పోస్ట్ చేస్తుంటాడు. చైతూకు ఎక్కువగా కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం.. కార్ రేసింగ్‏లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం చైతూ డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యాడు.. ధూత అనే వెబ్ సిరీస్‎లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాల మధ్య ఈ సిరీస్ తెరకెక్కించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement