Thursday, May 9, 2024

Breaking: మునావర్ ఫారూఖీ షో రద్దు

హైదరాబాద్ లో జరగాల్సిన మునావర్ ఫారూఖీ కామెడీ షోను రద్దు చేశారు. ఈ నెల 9న మునావర్ షో జరగాల్సిన ఉంది. అయితే, కరోనా దృష్ట్యా మునావర్ ఫారూఖీ షోను రద్దు చేసుకున్నారు. షోకు టికెట్ బుక్ చేసుకున్నవారికి రీఫండ్ చేయనున్నారు.

ఈ షోపై గతంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించారు.  హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వమని చెప్పారు. మునావర్‌ ఫారూఖీ స్టాండప్‌ కామెడీ షోకు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. మునావర్‌ ఫారూఖీ షోలకు ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు అనుమతి ఇవ్వలేదని, పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మతపరంగా రెచ్చగొట్టే ఇలాంటి షోలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అనుమతిస్తే.. బీజేపీ అడ్డుకొని తీరుతుందని రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement