Monday, April 29, 2024

చిక్కుల్లో ఆచార్యలోని ‘సానా క‌ష్టం’ సాంగ్

ఆచార్య చిత్రం నుండి సానా క‌ష్టం ఐటెం సాంగ్ రిలీజ్ అయి గంట‌ల్లోనే రికార్డ్ వ్యూస్ ని ద‌క్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, రెజీనా అందాలు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అనే చెప్పాలి. అయితే ఈ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. సానా క‌ష్టం సాంగ్ త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని ఆర్ ఎంపీ, పీఎంపీల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట రచయిత, దర్శకులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సానా కష్టం పాటలో ‘‘ ఏడేదో నిమరచ్చని కుర్రోళ్లు ఆర్ఎంపీలు అయిపోతారనే’’ లిరిక్ అభ్యంతరంగా ఉందంటూ ఆర్ఎంపీలు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement