Wednesday, May 8, 2024

ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు వరించింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలీహిమ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ‘’ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా దేశవిదేశాల్లో మొక్కలు నాటిన నా వృక్ష ప్రేమికులందరిది” పేర్కొన్నారు.

రాజస్థాన్ లో జరుగుతున్న “వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డుల ప్రధానోత్సవంలో “ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్”, “ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా” చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు అందుకోవల్సిన సంతోష్ కుమార్.. అధికారిక కార్యక్రమాల వల్ల అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రాఘవ, మర్ది కరుణాకర్ రెడ్డి అవార్డును స్వీకరించారు. అవార్డు వేడుకకు అందుబాటులో లేని కారణంగా, తన సందేశం పంపించిన సంతోష్ కుమార్, తనను అవార్డుకు నామినేట్ చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. పచ్చని ప్రకృతి కోసం మేం చేస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమానికి అనేక అవార్డులు ప్రశంసలు దక్కాయి. కానీ ఇది అన్నింటికంటే ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆరవ పర్యవరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనేక పర్యవరణహిత కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ప్రకృతి ప్రేమికుడు ఎరిక్ సోలిమ్, అదేవిధంగా ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన విష్ణులాంబ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ఎక్కడలేని ఎనర్జీని అందించిందని ఆయన తెలిపారు.

ప్రకృతిపట్ల ప్రేమతో, నిత్యం ప్రకృతిఆరాధనచేసే లాంబ గ్రామం నుంచి వచ్చిన విష్ణు శ్రీ కల్పతరు సంస్థాన్ ను స్థాపించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థల్ని, వ్యక్తుల్ని ప్రోత్సహించడం తనను అమితానందం కలిగిచిందన్నారు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న “ఎరిక్ సోలిమ్” “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”పై ప్రశంసలు కురిపించారు. ఒక్కడిగా మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో మొక్కలు నాటించే స్థాయికి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం రేపటి తరానికి నిజమైన బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత నిస్వార్ధంగా ముందుకు తీసుకుపోతున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement