Monday, November 11, 2024

Breaking : అగ్నికి ఆహుత‌యిన పంట‌ – 15మంది రైతుల ఆవేద‌న‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని చకియా ప్రాంతంలో గోధుమ పంట పొలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 15 మంది రైతుల క‌ష్టం బూడిదైంది. చకియాలోని సికందర్‌పూర్ గ్రామ పరిధిలోని సివాన్‌లో మంటలు చెలరేగడంతో 40 బిఘాల గోధుమ పంట దగ్ధమైంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే గోధుమ పంట కాలిపోయింది. మంటలు ఎలా చెలరేగాయి అనేది ఇంకా తెలియరాలేదు. పొలాల మధ్య నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైరులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. పొలాల్లో మంటలు చెలరేగడానికి కారణమేమిటో స్థానిక అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ రైతుల నష్టాన్ని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదయోగ్యమైన పరిహారం ఇస్తుందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement