Tuesday, October 15, 2024

మొట్టమొదటి ఎల‌క్ట్రిసిటీ బస్ – ఈకేఏ E9 ఆవిష్క‌ర‌ణ‌

విద్యుత్ వాహనాల‌ తయారీదారు, సాంకేతిక సంస్థ పిన్నకిల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన ఈకేఏ ఇవ్వాల తన ఇ9 విద్యుత్ బస్సును ఆవిష్క‌రించింది. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే, EKA & పినాకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ డా. సుధీర్ మెహతా చేతుల మీదుగా ఈ బస్సును ప్రారంభించారు. E9 ఆవిష్కరణతో ప్ర‌యాణికుల‌కు త‌క్కువ ఖ‌ర్చుతోనే ఆధునిక వ‌స‌తులు గ‌ల ప్ర‌యాణం ద‌క్క‌నుంది. చాలామంది విద్యుత్ వాహనాల కొనుగోలు చేస్తున్న క్ర‌మంలో ఈకేఏ వారి E9 విద్యుత్ బస్సు ప్రత్యేకంగా ఆక‌ర్షించ‌నుంది. శక్తివంతమైన Li-Ion బ్యాటరీతో ఈ బ‌స్సు చార్జింగ్ వ్యవస్థ సేఫ్‌గా రూపొందించారు. ప్రారంభ కార్యక్రమములో డా. సుధీర్ మెహతా మాట్లాడుతూ.. భారతదేశపు డీకార్బొనైజేషన్ వ్యూహములో వాణిజ్య వాహనాల విద్యుద్దీకరణ, ప్రజా రవాణా, ముఖ్యంగా బస్ విభాగం కీలకమైంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement