Saturday, April 27, 2024

MOVIE: నేను వ‌స్తే ద‌బిడ దిబిడే.. ఇప్పుడే రానంటున్న ’అఖండ‘!

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో రూపొందించిన ‘అఖండ‘ మూవీ లేట్ అయ్యే చాన్సెన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా దసరాకే రిలీజ్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, షూటింగు పార్టు ఇంకా పూర్తికాని కారణంగా థియేట‌ర్ల‌లోకి రాలేదు. దీంతో ఈ దీపావళి సందర్భంగా నవంబర్ 4న బాక్సాపీస్ ముందుకు రానున్నట్టుగా ప్రచారం జరిగింది.

దీపావళికి పోటీ తక్కువగా ఉంటుంద‌ని.. అందుక‌నే ఈ సినిమా తప్పకుండా థియేటర్లకు వస్తుందనే అంతా అనుకున్నారు. కానీ, ఆ రోజున సినిమాను రిలీజ్ చేయడం లేదని ఇప్పుడు ఫిలింన‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా పనులులన్నీ పూర్తి కాక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది. అందుక‌ని డిసెంబర్‌లో కానీ రిలీజ్ కాదేమోన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రెండు బ్లాక్ బస్టర్ హిట్ల త‌ర్వాత బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే హైప్ క్రియేట్ అయ్యింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో పూర్ణ ఒక కీల‌క పాత్రలో కనిపించనుంది. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement