Wednesday, May 8, 2024

TS: కెఆర్ఎంబికి ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చిల్లర వ్యవహారం

కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం చిల్లర వ్యవహరమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అసంబద్ధమైన ఆరోపణలు , ఫిర్యాదులు చేసి ఏపీప్రభుత్వం గౌరవాన్ని దిగజార్చుకుంటుందన్నారు. నాగార్జున సాగర్ నుండి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తెలంగాణ వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదుల్లో సహేతుకత లేదన్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్ ని కాపాడేందుకు సాంకేతికపరంగా ఐదు, పది నిమిషాల ఉత్పత్తి అప్పుడప్పుడు జరగడం సహజమేనన్నారు. శ్రీశైలం నుండి తెలంగాణ ఉత్పత్తి ఆపేసిన ఆంధ్రప్రదేశ్  కోనసాగిస్తుందని అయినా తాము చిల్లర ఫిర్యాదులు చేయడంలేదన్నారు.సమైక్య ఆంధ్రలో దుర్మార్గంగా నీటిని ఆంధ్రకు బలవంతంగా తరలించుకెళ్ళారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రభుత్వానికి నీటి యాజమాన్యం తెలీక తమ పై ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు.

కాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్‌ ఉత్పత్తికి సాగర్‌ నుంచి తెలంగాణ నీటి వినియోగం అడ్డుకోవాలని ఈ లేఖలో విన్నవించారు. తాగు నీటికి లేకుండా విద్యుత్‌ ఉత్పత్తికి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని తెలంగాణ దుర్వినియోగం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement