Monday, May 6, 2024

హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలిపిన మెగాస్టార్ – వీడియో పోస్ట్

త‌న ట్విట్ట‌ర్ ఖాతా పేరును ఆచార్య‌గా మార్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నాడు..కాగా తన కుమారుడు రామ్ చరణ్ కు సంబంధించి మనసుకు హత్తుకునే ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవికి స్వతహాగా హనుమంతుడంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నేడు హనుమ జన్మదినం పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. ఆ వీడియోను అందరితోనూ పంచుకున్నారు. కాటేజీలో మేకప్ వేసుకుంటూ రామ్ చరణ్ రెడీ అవుతుండగా.. హనుమ ప్రతిరూపమైన ఓ కోతి అక్కడకు వచ్చింది. మేకప్ వేసుకున్నంత సేపు అక్కడే తారాడింది. మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. కోతికి బిస్కెట్లను అందించాడు. ఆ వీడియోకు హనుమ శ్లోకమైన ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ను బ్యాగ్రాండ్ గా చిరంజీవి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement