Sunday, April 28, 2024

Srinagar: ఆర్మీ క్యాంప్‌ సమీపంలో 5కిలోల ఐఈడీ వెలికితీత‌

జ‌మ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఆర్మీ క్యాంప్‌ సమీపంలో భారీ మందుపాతరను వెళికితీశారు. జిల్లాలోని గుర్దాన్‌ చావా వద్ద రాజౌరీ గుర్దాన్‌ రోడ్డుపై అనుమానాస్పద వస్తువులున్నాయనే సమాచారంతో భధ్రతా బలగాలు గాలింపు నిర్వహించాయి. ఈ క్రమంలో ఆర్మీ క్యాంప్‌ సమీపంలో పాతిపెట్టిన ఐదు కిలోల ఐఈడీని గుర్తించారు. దీంతో దానిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement