Sunday, April 28, 2024

ఘనంగా హనుమాన్ జయంతి .. కిక్కిరిసిన దేవాలయాలు

హనుమాన్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని హనుమాన్ దేవాలయం జయంతి వేడుకల కోసం ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. జయంతిని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. రైల్వే స్టేషన్ రోడ్ లోని హనుమాన్ దేవాలయంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement