Friday, December 6, 2024

సాల్ట్ లేక్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

ఫుట్ ఖాక్ బ‌జార్ లోని సాల్ట్ లేక్ మార్కెట్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.ఈ ఘటనలో ఆరు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఓ దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బిధాన్‌నగర్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్‌బోస్‌, బిధాన్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఈ ప్రమాదం కోల్ కతాలో చోటు చేసుకుంది. ఈ అగ్నిప్ర‌మాదం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఎఫ్ డి బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement