Thursday, April 25, 2024

తెలుగు పాట‌కు విశ్వ‌ఖ్యాతి..

భారతీయ చలనచిత్రరంగానికి, ప్రత్యేకించి టాలీ వుడ్‌కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కిన సందర్భం జాతిని ఉత్తేజపరుస్తోంది. ప్రపంచ సినీవినోద రంగంలో అకా డమీ అవార్డుల తరువాత ప్రముఖమైనదిగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును ఓ తెలుగు సినిమా పాట గెలు చుకుని భారత సినీరంగ యవనికపై తళుక్కున మెరిసిన సందర్భమిది. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు… బ్రిటిష్‌ పాలకులపై కలసి చేసిన పోరాటమే ఇతివృత్తంగా నిర్మించిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ (రణం, రౌద్రం, రుధిరం) సినిమాలో చంద్రబోస్‌ విరచిత ‘నాటు -నాటు’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించింది. భారత సినీరంగ చరిత్రలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు ఇదే తొలిసారి.ఆ మాటకొస్తే ఆసియా దేశాలు గెలుచుకున్న తొలి అవార్డు. తెలుగుపాట ద్వారా ఆ గౌరవం దక్కడం తెలుగుజాతికి గర్వకారణం. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. సాధారణంగా ఈ అవార్డులు గెలుచు కుంటే… దాదాపు ఆస్కార్‌ దక్కినంతగా సంబర పడతా రు. అంతేకాదు.. ఈ అవార్డు అందుకున్న అనేక చిత్రాలు, నటీనటులు, సాంకేతికత నిపుణులు ఆస్కార్‌ గెలుచుకున్న సందర్భాలు కోకొల్లలు. ప్రస్తుతం అస్కార్‌ బరిలో అనేక కేటగిరీల్లో పరిశీలనకు ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం దరఖాస్తు చేసుకోగా.. ఒకటి రెండు విభాగా ల్లోనైనా పరిశీనలకు ఎంపికవ్వచ్చని భావిస్తున్న తరుణం లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించడం శుభ సూచకం.

నిజానికి ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళికి ఇప్పటికే న్యూయా ర్క్‌ ఫిలిమ్‌ క్రిటిక్స్‌ అవార్డు వరించింది. విదేశీ చలన చిత్రాలకు సంబంధించి అవార్డులిచ్చే లక్ష్యంతో 1944లో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ ప్రారం భించిన ఈ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు… ఇన్నాళ్లకు భారత్‌ను వరించడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమను దిగంతాలకు వ్యాపింపజేసిన దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా తీసినా అదొక సంచలనం. ఇప్పుడు తెలుగు సినిమా రికార్డులను ఆయన నిర్మించిన త్రిపుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌ ఆర్‌) హాలీవుడ్‌లో తీవ్ర సంచలనాన్ని సృష్టిం చింది.ఆ సినిమా కోసం సుప్రసిద్ధ గేయరచయిత చంద్ర బోస్‌ రాసిన నాటు-నాటు పాట ఇప్పుుడు ప్రపంచ వేదిక లపైనా మారుమోగుతోంది. సినీ సంగీత ప్రియ లను ఓలలాడిస్తోంది. గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాట కు అంత ఆదరణ వచ్చేట్టు, యువతను ఆనంద పరవ శులను చేసేట్టు ఎంతో హృద్యంగా పాడారు. రాజమౌళి చిత్రాలు భారతీయ సంప్రదా యానికి అద్దం పడతాయి. ఆయన తీసిన బాహుబలి-1, బాహుబలి -2 భారత చలన చిత్ర చరిత్రలో రికార్డులను సృష్టించింది. హాలీవుడ్‌ నటులను సైతం నివ్వెరపర్చింది. ఒక తెలుగు దర్శకుడు ఇంతటి ఉన్నత ప్రమాణాల్లో చిత్రాన్ని తీయగ లగడాన్ని ఎంతో గొప్పగా ప్రశంసిం చింది. అదే టీమ్‌ వర్క్‌తో సంగీత దర్శకుడు కీరవాణి అందిం చిన బాణీలు సంగీతానికి జీవం పోశాయి.

రాజమౌళి, కీరవాణిలు ఇద్దరూ సంప్రదాయానికి పెద్ద పీట వేసేవారే. ఇప్పుడు అవార్డు గెల్చుకున్న నాటు- నాటు పాట పైకి చూస్తే జాన పదంగానే కనిపిస్తుంది. ఇందులో కూడా విశిష్టత కనబ డేట్టు చేశారాయన. రాజమౌళి నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఆయన ముందుగా ప్రకటించినట్టుగానే అంతర్జాతీయ వేదికపై అపూర్వమైన గౌరవాలను అందుకోవడం గర్వించదగిన విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ చిత్రం అంతర్జాతీయంగా అవార్డు గెల్చుకోవ డం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీ యులందరూ గర్వపడే సమయమిదని అంటూ ఆయన ఈ చిత్ర దర్శకుణ్ణి, సంగీత దర్శకుణ్ణి పేరుపేరునా ప్రస్తావించి అభినందించారు. సాధారణంగా ప్రధాన మంత్రి సినీ అవార్డుల గురించి ఇంతగా స్పందించిన సందర్భాలు లేవు. ఈ చిత్రానికి వచ్చిన అవార్డు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందంటూ ప్రధాని ప్రశం సించారు. ప్రేక్షకులను తన వెంట నడిపించే దర్శకునిగా రాజమౌళి ఈ చిత్రంతో మరింత పేరొందారు. ఆయన తెలుగు చిత్రరంగంలో కూడా అపూర్వమైన విజయా లను సాధించారు. ఆయన ఎంతోమంది నటులకు బంగారు భవిష్యత్‌ని ఇచ్చారు. అవార్డుల కోసమని ఆయన చిత్రాలు తీయలేదు. ఆయన తీసిన చిత్రాలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రభుత్వ అవార్డ ుల కన్నా, ప్రజల రివార్డులే ఎక్కువగా భావించిన ఆయన చిన్న వయసులోనే తెలుగు దర్శకులలో అగ్రశ్రేణిలో నిలి చారు. పాటల రచయిత చంద్రబోస్‌ కూడా తెలుగులో ఎన్నో మంచి గీతాలను అందించారు. తెలుగులో ప్రస్తుతంఉన్న ఉత్తమ గేయ రచయతలలో ఆయన ఎన్నదగిన వారు. 19 మాసాల కృషి ఫలించిందంటూ ఆయన ఈ చిత్రం లో పాటకు వచ్చిన అవార్డుపై స్పందిం చిన తీరు ఆయన శ్రమ ఎంతో ఉందో స్పష్టం అవుతోంది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న త్రిపుల్‌ ఆర్‌ బృందం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శాశ్వత స్థానాన్ని అలం కరించిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement