Monday, April 29, 2024

Sankranthi Effect : పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఎక్క‌డ ఉన్నా సంక్రాంతి పండుగ‌కు తొంతూళ్ల‌కు వ‌స్తుంటారు. కుంటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా జ‌రుపుకుంటారు. సంక్రాంతి పండుగకు ఉద్యోగుల‌కు వ‌రుస సెల‌వులు రావ‌డంతోపాటు ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు నేటి నుంచి సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో ప‌ట్నం వాసులు ప‌ల్లెబాట ప‌ట్ట‌డంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు చేప‌ట్టారు. టోల్ బూత్‎లలో సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే వాహ‌నాల‌ను వ‌దులుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా క‌ట్ట‌డి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ర‌హ‌దారిపై యాక్సిడెంట్ స్పాట్లు గుర్తించి భారీ కేట్లు ఏర్పాటు చేశారు. ప్ర‌మాదాల నివార‌ణ‌కు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితోపాటు కొర్లపాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement