Sunday, May 19, 2024

కోవిడ్ 2ని త‌గ్గించ‌డంలో సాయ‌ప‌డ‌నున్న – మాంటెలుకాస్ట్

కోవిడ్ 2ని త‌గ్గించ‌డంలో సాయ‌ప‌డ‌నుంద‌ట ఆస్త‌మా చికిత్స‌లో భాగంగా ఉప‌యోగించే ఔష‌ధం ‘మాంటెలుకాస్ట్’ సార్స్.. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆస్తమా, హే ఫీవర్, హైవ్స్ లో సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాపు సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడంలో మాంటెలుకాస్ట్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఐఐఎస్ సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఔషధం సార్స్ కోవిడ్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్ పీ1ని గట్టిగా బంధిస్తుంది. మానవ కణాల్లోకి ముందుగా ప్రవేశించే ఎన్ఎస్ పీ1ను అడ్డుకుంటుంది. ఈ ప్రొటీన్ మన రోగనిరోధక కణాల లోపల ప్రొటీన్-తయారీ యంత్రాలను రైబోజోమ్‌లతో బంధించగలదు. రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన ప్రొటీన్ల సంశ్లేషణను అడ్డుకుంటుంది. ఫలితంగా కరోనా వైరస్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్ పీ1 బలహీనపడుతుంది. ఈ అధ్యయన వివరాలు జర్నల్ ‘ఈ లైఫ్’లో ప్రచురితమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement