Friday, May 3, 2024

కరోనా కాలంలో మరో రియల్ హీరో..కారు అమ్మేసి..

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ల కోరత ఏర్పడింది. ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించినా.. ఒకేసారి పెరిగిపోయిన కరోనా కేసులతో సరిపడినంతగా అందించడానికి కష్టంగా మారింది. కరోనా సమయంలో పక్కనున్నవాళ్లను ఆదుకోవాలనే మానవత్వం క్రమంగా తగ్గిపోతున్నది. సహాయం చేస్తే ఎక్కడ వారికి కరోనా అంటుకుంటుందో అని భయపడుతున్నారు. అయితే, కరోనా కాలంలో ముంబైకి చెందిన ఓ యువకుడు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు నడుం బిగించాడు. ఉచిత ఆక్సిజన్ సరఫరా పథకం చాలా మందికి ఊపిరి అందిస్తోంది. ఇందుకోసం షాహనావాజ్ షేక్ అనే యువకుడు గతేడాది రూ.22 లక్షలు విలువ చేసే తన ఎస్‌యూవీని ఆమ్మేశాడు. కరోనా రోగులను కాపాడేందుకు ఉన్న ఆక్సిజన్ సరఫరా పథకాన్ని ప్రారంభించాడు.

ముంబైలోని కోవిడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని షాహనావాజ్ అన్నాడు. గత సంవత్సరం తాము 5,000 నుండి 6,000 మందికి ఆక్సిజన్ అందించామని తెలిపాడు. అయితే, ఈ సంవత్సరం ముంబై నగరంలో ఆక్సిజన్ కొరత ఉందన్నాడు. ఇంతకు ముందు 50 కాల్స్ వచ్చేవని, ఇపుడు ఆ సంఖ్య 500 నుండి 600 వరకు ఉంటోందని వివరించాడు. కోవిడ్ తొలి దశలో తన స్నేహితుడి బంధువు కోవిడ్ -19 తో మరణించారని, ఖర్చు లేకుండా ఆక్సిజన్‌ ను సరఫరా చేయాలనే ఆలోచన అప్పడే ప్రారంభమైందని తెలిపాడు. దానికోసం కావలసిన ఆక్సిజన్ సిలిండర్లను కొనడానికి తన ఎస్‌యూవీని అమ్మేశానని చెప్పారు.


కాగా, ప్రస్తుతం షాహనావాజ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆయన చేస్తున్న సేవపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement