Wednesday, May 15, 2024

ఇదేం షో..మొస‌లి నోట్లో చెయ్యి..బ‌తుకు జీవుడ‌యిన వ్య‌క్తి..

మూగ‌జీవాలలో క్రూర జంతువులు కూడా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అలాంటి వాటికి మ‌నం ఎంత‌దూరం ఉంటే అంత‌మంచిది. తెలిసి కూడా వాటిని రెచ్చ‌గొట్టామో మ‌న‌ప‌ని గోవిందా. అదే ఇప్పుడ‌దే జ‌రిగింది ఓ వ్య‌క్తి విష‌యంలో. నీటిలో తేలియాడే మొస‌ళ్ళు..వాటిని చూస్తేనే గుండె ఝ‌ళ్ళుమంటుంది..అలాంటిది దాని నోటిలో చెయ్యి పెట్ట‌డ‌మంటే పెద్ద సాహ‌స‌మ‌నే చెప్పాలి. ఈ సాహ‌సానికి ఒడిగ‌ట్టాడో వ్య‌క్తి..ఏదో షో చేద్దామ‌ని ప్ర‌య‌త్నించి ..ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. వివ‌రాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి నోరు తెరిచి ఉన్న మొసలి నోట్లో కుడి చెయ్యి పెట్టాడు. ఆ తర్వాత ఏదో వివరిస్తూ… ఎడమ చెయ్యి పెట్టాడు. కొద్దిగా కాదు… మొత్తం చెయ్యి అంతా పట్టేలా ఇంకా ఇంకా దూర్చాడు. ఆ తర్వాత ఏదేదో చెబుతూ… మొసలివైపు చూస్తూ… హడావుడి చేశాడు. అంతలో ఊహించని షాక్ ఇచ్చింది మొసలి. ఒక్కసారిగా చెయ్యిని కొరికేసి, నమిలేసింది. దాంతో… తిప్పలు పడుతూ… లబోదిబోమంటూ… చెయ్యిని ఎలాగొలా వెనక్కి తీసుకున్నాడు. కానీ అప్పటికే పెద్దగాయాలు అయ్యాయి..

అసలే మొస‌లి దవడలు చాలా పెద్దగా ఉంటాయి. దాని నోరు ..మన తల పట్టేంత పెద్దగా ఉంటుంది. అందుకే మొసలిని చూడగానే చాలా మంది భయపడతారు. అది నేలపై ఉన్నప్పుడు దానికి శక్తి అంతగా ఉండకపోయినా… దాని నోరు చూసి అమ్మో అంటారు. అలాగని నేలపై ఉన్నంత మాత్రాన మొసలి దాడి చెయ్యదు… ప్రశాంతంగా ఉంటుంది అనుకోవడానికి లేదు. నీటిలో ఉన్నా, నేలపై ఉన్నా… మొసలి మొసలే… కాబట్టి… దానికి మాంసం కనిపిస్తే కొరకకుండా ఉంటుందా. తెలిసి చేసిన త‌ప్పుకి శిక్ష త‌ప్ప‌దుగా. ఇప్పుడా వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement