Sunday, April 28, 2024

గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల విస్తృత తనిఖీలు

ప్రజల ఆరోగ్యం,ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాలు, గుట్కా, వంటి వాటిని అరికట్టేందుకు జిల్లాలో నిర్వహిస్తున్న పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ స్వయంగా బుధవారం ఆమదాలవలస రైల్వే స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్‌ సిబ్బంది, రైల్వే పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తో ముమ్మరంగా రైల్వేస్టేషన్‌ పరిసరప్రాంతాలు, పార్సెల్‌ సర్వీస్‌ కేంద్రాలు, ప్రయాణికులు ప్రయాణించే రైల్వే బోగీలను,అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్‌,రవాణా బ్యాగుల‌ను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గంజాయి,ఖైనీ, గుట్కా, మద్యం వంటి ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు,రవాణాను అరికట్టడం కోసం పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చేసిన స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు . ఇందులో భాగంగా అదనపు ఎస్పీ,డిఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షణలో స్థానిక పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్‌ సిబ్బంది, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, బీడీ టిమ్స్‌,పోలీసు జాగిలాలు టీ-మ్స్‌ 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్‌,బస్‌ స్టేషన్‌, టోల్‌ ప్లాజా,తనిఖీ కేంద్రాలు వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.

మాధకద్రవ్యాలు రవాణా, విక్రయాలు,గంజాయి పంటలు సాగు చేసిన వారిని గుర్తించి గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.ఇప్పటికే విక్రయదారులు గుర్తించి వారిపై సస్పెక్ట్‌ షీట్స్‌ ఓపెన్‌ చేసి నిరంతరం నిఘా పెట్టామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న రైడ్స్‌ వల్ల కొన్ని చోట్ల అక్కడ అక్కడ తక్కువ మొత్తంలో గంజాయిని పట్టు-కుని కేసుకు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఒడిశా, విశాఖపట్నం రూరల్‌ ప్రదేశాలనుంచి మా జిల్లాకు గంజాయి రమణ చేసే అవకాశం ఉన్నందున ఆ తరహాలో తనిఖీ కేంద్రంలు వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామనిన్నారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాల్లో ఎవరైతే యువత ఎక్కువగా పాలుపంచుకుంటు-నట్లయితే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగంగా పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయడం జరుగుతుందని వివరించారు.ఎన్‌.డి.పి.ఎస్‌ చట్టం ప్రకారం కేసులు నమోదయితే బెయిల్‌ రావడం చాలా కష్టమని యువత ఈ విషయాన్ని గుర్తించి అలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ తరహా నేరాలకు క్రమేపీ పాల్పడితే అలాంటి వారి ఆస్తులును పీడీ చట్టం ప్రకారం జప్తు చేయడం జరుగుతుందన్నారు. అనుమానాస్పదంగా ఏదైనా తారసపడితే వెంటనే కంట్రోల్‌ రూమ్‌, డయల్‌- 100 కు సమాచారం అందించాలన్నారు స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె పి గోపాల్‌, శ్రీకాకుళం టౌన్‌ డిఎస్పీ ఎం.మహేంద్ర, ఆమదాలవలస సిఐ పి. పైడయ్య, ఎస్‌.ఐ.లు,స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో సిబ్బంది,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement